: సిగరెట్ల అమ్మకాలు తగ్గాయి... అంచనాలకు దిగువన ఐటీసీ లాభాలు

సిగరెట్ల నుంచి హోటల్స్ వరకూ వివిధ రంగాల్లో విస్తరించి వున్న ఐటీసీ నికర లాభం గడచిన ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో నిపుణుల అంచనాలను తాకలేకపోయింది. సిగరెట్ల అమ్మకాలు తగ్గడం, టూరిజానికి అన్ సీజన్ తదితర కారణాలతో సంస్థ నెట్ ప్రాఫిట్ రూ. 2,361 కోట్లుగా నమోదైంది. గత సంవత్సరం ఇదే సమయంలో 9,238.5 కోట్లుగా ఉన్న ఆదాయం ఈ సంవత్సరం రూ. 9,293 కోట్లకు పెరిగి నామమాత్రపు వృద్ధిని నమోదు చేసుకుంది. జనవరి-మార్చి మధ్యకాలంలో రూ. 2,507 కోట్ల నికర లాభాన్ని ఆర్జించవచ్చని విశ్లేషకులు అంచనా వేశారు. ఆపరేటింగ్ మార్జిన్ 34.7 శాతం నుంచి 34.9 శాతానికి మెరుగు పడిందని సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. సిగరెట్లు, హోటల్ తదితర రంగాల్లో ఆదాయాలు పెరిగినప్పటికీ, అగ్రికల్చర్, పేపర్ వ్యాపారం తీవ్రంగా దెబ్బతింది. అగ్రి వ్యాపారం నుంచి వచ్చిన ఆదాయం 2013-14 క్యూ-4తో పోలిస్తే రూ. 2,004 కోట్ల నుంచి రూ. 1,428 కోట్లకు, పేపర్ విభాగం ఆదాయం రూ. 1,261.2 కోట్ల నుంచి రూ. 1,202.6 కోట్లకు తగ్గాయి. ఈ ఫలితాల సందర్భంగా ఒక్కో ఈక్విటీ వాటాపై రూ. 6.25 డివిడెండును బోర్డు సిఫార్సు చేసినట్టు ఐటీసీ వెల్లడించింది.

More Telugu News