: తృణమూల్ నేత ఇంట్లో భారీ పేలుడు, భార్య మృతి

తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నేత బురో బర్బహమ్ నివాసంలో ఆదివారం ఉదయం భారీ పేలుడు సంభవించింది. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్ కతాలో ఈ ఘటన జరుగగా, ఆయన భార్య బురో హన్సడా అక్కడికక్కడే మృతి చెందారు. ఈ పేలుడుతో ఇంటికి మంటలంటుకోగా, సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. బర్బహమ్ ఫిర్యాదు మేరకు ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రత్యర్ధి పార్టీల వారు లేదా ఆయన శత్రువులు ఎవరైనా ఈ ఘటనకు పాల్పడ్డారా? లేక ప్రమాదవశాత్తూ పేలుడు సంభవించిందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి వుంది.

More Telugu News