: డీజిల్ కోసం పక్క రాష్ట్రాలకు లారీలు... పెట్రోల్ బంకులు మూసేస్తామని హెచ్చరిక!

తెలుగు రాష్ట్రాలతో పోలిస్తే పక్కనున్న మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో పెట్రోలు, డీజిల్ ధర తక్కువగా ఉన్న సంగతి తెలిసిందే. ఆ రాష్ట్రాలతో పోలిస్తే ఏపీ, తెలంగాణలో నాలుగు రూపాయల అదనపు వ్యాట్ భారంగా వుంది. దీంతో రోజూ వేలాది లీటర్ల డీజిల్ వినియోగించే లారీల యజమానులు పక్క రాష్ట్రాల నుంచి డీజిల్ కొనుగోలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడి బంకులకు తీవ్ర నష్టం వస్తోంది. వ్యాట్ భారంతో అమ్మకాలు గణనీయంగా పడిపోయాయి. దీంతో, పెట్రోల్ బంకులవారు ఆందోళనకు సిద్ధమవుతున్నారు. జూన్ మూడో తేదీలోగా ప్రభుత్వం విధించిన వాట్ ను తొలగించకపోతే బంకులను మూసివేస్తామని పెట్రోలు బంకుల యజమానుల సంఘం హెచ్చరించింది.

More Telugu News