: ఎండకు తట్టుకోలేకపోతున్న 'బీర్' బాబులు... 23 రోజుల్లో 27 లక్షల కేసులు హాంఫట్!

పెరిగిన ఎండలు బీర్ల అమ్మకాలను రికార్డు స్థాయికి చేర్చాయి. మే నెలలో నిన్నటి వరకూ తెలంగాణలో 27 లక్షల కేసులు అమ్ముడయ్యాయని తెలుస్తోంది. ఏప్రిల్ నెల మొత్తంలో 21 లక్షల కేసులు అమ్ముడుకాగా, ఈ నెల పూర్తయ్యేలోపు 35 లక్షల కేసుల వరకూ విక్రయాలు జరగవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఒక్కో కేసులో 12 బీరు సీసాలు, 7.8 లీటర్ల బీరు ఉంటుంది. ఈ లెక్కన ఈ నెలలో 2.10 కోట్ల లీటర్ల బీరు మార్కెట్లోకి పారినట్టే! ఒక్క హైదరాబాద్ పరిధిలోనే రోజుకు 8,200 కేసుల బీరు విక్రయాలు సాగుతున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా మార్చి నెలలో రోజుకు సగటున 10,400 కేసులు, ఏప్రిల్ లో 13 వేల కేసులు అమ్ముడుకాగా, మేలో ఏకంగా రోజుకు 18 వేల కేసుల అమ్మకాలు సాగుతున్నాయి. బీర్లకు గిరాకీ పెరగడంతో తమకు మార్జిన్లు అధికంగా లభించే కంపెనీల బీర్లను అమ్ముతున్న మద్యం దుకాణదారులు బ్రాండెడ్ బీర్ల కొరతను చూపుతున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి.

More Telugu News