ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

మూడేళ్లలో చంద్రయాన్-2... మరో గ్రహాంతర యాత్రకు సిద్ధమైన ఇస్రో

Thu, May 21, 2015, 01:18 PM
Related Image ఇప్పటికే మంగళయాన్, చంద్రయాన్ లాంటి ప్రయోగాలతో మన దేశ కీర్తిని నలుదిశలా చాటిన ఇస్రో మరో భారీ ప్రయోగానికి రంగం సిద్ధం చేసుకుంటోంది. మరో మూడేళ్లలో చంద్రయాన్-2ను ప్రయోగించనుంది. ఇస్రో ఛైర్మన్ ఏఎస్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ, ఈ వివరాలను వెల్లడించారు. ఈ ప్రయోగానికి ఏర్పాటు చేసిన అడ్వైజరీ కమిటీకి ప్రముఖ అంతరిక్ష శాస్త్రవేత్త యూఆర్ రావు నేతృత్వం వహిస్తారని తెలిపారు. మన గ్రహ వ్యవస్థలోని ఏ గ్రహం మీదకైనా అంతరిక్ష నౌకలను పంపే విధంగా ప్రయోగాలు చేపట్టాలన్న అంశంపై చర్చలు కొనసాగుతున్నాయని చెప్పారు.
X

Feedback Form

Your IP address: 54.211.207.116
Articles (Latest)
Articles (Education)