: జుట్టు రాలడాన్ని ఇలా అరికట్టవచ్చు!

జుట్టు రాలడం అనేది అన్ని వయసుల వారిలోనూ ఈవేళ కామన్ అయిపోయింది. ఇరవైలలోనే యువకులు బట్టతలబారిన పడడం వారిలో ఆందోళన రేకెత్తిస్తోంది. అందంపై ఆదరణ పెరుగుతున్న ప్రస్తుత తరుణంలో జుట్టు రాలడం యువతను ఒత్తిడిలోకి నెడుతోంది. జుట్టు రాలడానికి ప్రధాన కారణం వాతావరణ కాలుష్యమని, చుండ్రు అని పలువురు పేర్కొంటారు. అయితే కారణాలేవైనా పరిష్కారాలు మాత్రం అందరికీ అందుబాటులోనే ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఆహారంలో మార్పులతో జుట్టు రాలడాన్ని అరికట్టవచ్చని వారు సూచిస్తున్నారు. చేప, వాల్ నట్ ఆయిల్ వాడకం ద్వారా జుట్టుకు పోషకాలు అందించవచ్చని వారు తెలిపారు. కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్లు, సూక్ష్మ పోషకాలు ఆహారంలో సమపాళ్లుగా తీసుకుంటే జుట్టు రాలడాన్ని నియంత్రించవచ్చని వారు సూచిస్తున్నారు. స్త్రీలు 55 గ్రాములు, పురుషులు 65 గ్రాముల ప్రోటీన్ల చొప్పున రోజూ తీసుకుంటే జుట్టుకు మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. అంతకంటే ఎక్కువ ప్రోటీన్లు తీసుకుంటే కిడ్నీలు, కాలేయంపై భారం పడుతుందని వారు హెచ్చరిస్తున్నారు.

More Telugu News