: కనుపాపే 'స్మార్ట్' తాళం చెవి!

ఇప్పుడంతా స్మార్ట్ ఫోన్ల హవా సాగుతోంది. మామూలు మొబైళ్లు వాడేవారి సంఖ్య క్రమంగా తగ్గుతోంది. బడా కంపెనీలన్నీ 'స్మార్ట్' మార్కెట్ పైనే దృష్టి పెట్టాయంటే వీటి డిమాండ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే, వీటి ప్రాధాన్యత దృష్ట్యా భద్రత కూడా కీలకాంశమే. అందుకే, జపాన్ మొబైల్ దిగ్గజం ఎన్టీటీ డొకొమో, ఫ్యుజిత్సు సంస్థలు సంయుక్తంగా కొత్త రకం ఫోన్ ను మార్కెట్లోకి తెస్తున్నాయి. ఆ ఫోన్ లో ఇన్ ఫ్రారెడ్ స్కానర్ ఉంటుంది. అది, స్మార్ట్ ఫోన్ ను ఆన్ చేసిన అనంతరం, మీ కనుపాపలను స్కాన్ చేస్తుంది. అందులో నిక్షిప్తమైన ఉన్న డేటాతో సరిపోలితేనే ఫోన్ అన్ లాక్ అవుతుంది. కనుపాపలు మ్యాచ్ అయితేనే యాప్స్, ఇంటర్ నెట్, ఇతర కార్యకలాపాలను యాక్సెస్ చేయవచ్చు. అంటే, ఫోన్ ఇతరుల చేతిలో పడితే, దాని లాక్ తీయడం అసాధ్యమన్నమాట. ఈ ఐరిస్ టెక్నాలజీ రాకతో స్మార్ట్ ఫోన్లలో పాస్ వర్డ్ లు పెట్టుకోవడానికి ఇక ఎవరూ పెద్దగా మొగ్గు చూపరేమో. ఇక, ఐరిస్ స్కానర్ కాకుండా ఈ ఫోన్ లో 5.2 అంగుళాల క్యూహెచ్ డీ డిస్ ప్లే, 3 జీబీ రామ్, 32 జీబీ మెమరీ ప్రధాన ఫీచర్లు. ఆండ్రాయిడ్ లాలిపాప్ 5.0తో పనిచేస్తుంది.

More Telugu News