: స్మార్ట్ ఫోన్ స్విచ్ఛాఫ్ చేయడం వల్ల ఉపయోగం ఉండదా?

రాత్రి పడుకునేటప్పుడు స్మార్ట్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడం చాలామందికి అలవాటు. అలా చేయడం వల్ల బ్యాటరీ జీవితకాలం పెరుగుతుందని భావిస్తూ ఉంటారు. అయితే ఇది సరైన ఆలోచన కాదని, అలా చేయడం వల్ల బ్యాటరీ జీవితకాలం పెరగడం మాట అటుంచి, ఎక్కువ సార్లు స్విచ్ ఆఫ్ చేయడం వల్ల బ్యాటరీ జీవితకాలం తగ్గే ప్రమాదం ఉందని సాంకేతిక నిపుణుడు, ఐఫికిట్స్ వ్యవస్థాపకుడు కైలి వీన్స్ సూచించారు. ఫోన్ వాడుతూ ఉంటేనే బ్యాటరీ బాగా మన్నుతుందని ఆయన చెప్పారు. ఫోన్ ఛార్జింగ్ సగానికి తగ్గినప్పుడే చార్జింగ్ పెడితే బ్యాటరీ జీవితకాలం పెరుగుతుందని ఆయన వివరించారు. మ్యూజిక్ అతిగా వినడం, జీపీఎస్ వాడకం, వీడియోలు వీక్షించడం వల్ల బ్యాటరీ పాడైపోదని, అపోహలు వీడాలని ఆయన సూచించారు.

More Telugu News