: జగ్గీవాసుదేవ్ కు కేటాయించిన భూముల్లో జెండాలు పాతిన కాంగ్రెస్

కృష్ణాజిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని త్రిలోచనాపురంలో జగ్గీవాసుదేవ్ బాబాకు ఏపీ ప్రభుత్వం 400 ఎకరాల భూములు కేటాయించడంపై వివాదం ముదురుతోంది. భూములు ఇవ్వడానికి వీల్లేదని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ నేతలు అక్కడ జెండాలు పాతారు. మరోవైపు ఈ యోగా బాబాకు భూముల కేటాయింపును నిరసిస్తూ విజయవాడ సబ్ కలెక్టరేట్ దగ్గర సీపీఐ అర్ధనగ్న ప్రదర్శన చేపట్టింది. ఓ వైపు రాజధానికోసం రైతుల నుంచి భూములు లాక్కుంటూనే మరోవైపు యోగా బాబాకు వందల ఎకరాలు ఎలా ధారాదత్తం చేస్తున్నారని సీపీఐ కార్యకర్తలు ప్రశ్నించారు. ఇదిలాఉంటే జగ్జీవాసుదేవ్ కు భూమి కేటాయింపు సమంజసమేనని ఏపీ ప్రభుత్వం సమర్థించుకున్న సంగతి తెలిసిందే.

More Telugu News