: ఎన్నికల్లో 'నగ్న' ప్రచారం... అడ్డుకోలేమన్న అధికారులు!

ఎన్నికలొచ్చిన వేళ... ఓటర్లను ఆకట్టుకోవడానికి పోటీలో నిలిచిన అభ్యర్థులు ఎటువంటి చేష్టలు చేస్తుంటారో మనకు తెలియనివి కావు. కొందరు వీధుల్లో అంట్లు కడిగి, పిల్లల ముక్కులు చీది, బార్బర్ అవతారమెత్తి... ఇలా ఎన్నో పనులు చేస్తుంటారు. కానీ, జపాన్ రాజధాని టోక్యోలోని ఛియోడా వార్డుకు జరుగుతున్న ఎన్నికల పోరులో బరిలో నిలిచిన తెరుకీ గోటో, ఓటర్ల దృష్టిలో పడేందుకు మరింత భిన్నమైన మార్గాన్ని ఎంచుకున్నాడు. నగ్నంగా నిలబడి ఫోటోలకు పోజులిచ్చి వాటిని పోస్టర్లుగా ప్రింట్ చేసి ప్రచారం చేసుకుంటున్నాడు. ఈ తరహా ప్రచారాన్ని నిషేధించాలని ఇతర అభ్యర్థులు గగ్గోలు పెడుతుంటే, తప్పుడు సమాచారం ఇస్తూ, ఓటర్లను మభ్య పెడుతుంటే అడ్డుకోగలమే తప్ప, ఇలా బట్టలూడదీసుకొని ఫోటోలు తీయించుకుంటే తామేం చేయలేమని అధికారులు వెల్లడించారు.

More Telugu News