: తదుపరి చిత్రంతో జైలుకెళ్తానేమో!: కమలహాసన్

ప్రేక్షకుల మదిలో చిరకాలం నిలిచేలా, సహజత్వానికి దగ్గరగా ఉండే సినిమాలు తీసే కమలహాసన్ మరో వివాదాస్పద ప్రాజెక్టును చేపట్టారు. సమాజాన్ని పట్టి పీడిస్తున్న కుల వ్యవస్థను ఎండగడుతూ, 1968లో తమిళనాడులోని 'కిళవెన్‌మణి' అనే గ్రామంలో జరిగిన యథార్థ ఘటన ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతుందని కమల్ తెలిపారు. దీనికి 'ఉళ్లేన్ అయ్యా' (ఉన్నానయ్యా) అని పెట్టాలని అనుకుంటున్నారు. ఈ చిత్రం తీస్తే తమిళనాట తనను జైలుపాలు చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదని కమల్ అంటున్నారు. 44 మంది దళితుల ఊచకోతను చూసిన విద్యార్థి కోణంలో చెప్పేలా కథను సిద్ధం చేసుకున్నానని వివరించారు. సినిమా చిత్రీకరణ ఎప్పుడు మొదలు పెట్టనున్న విషయాన్ని మాత్రం ఆయన వెల్లడించలేదు.

More Telugu News