: స్త్రీ, పురుష వేతనాల్లో సమానత్వం ఉండాలి: హిల్లరీ క్లింటన్

స్త్రీ, పురుష వేతనాల్లో సమానత్వం ఉండాలని అమెరికా అధ్యక్షపదవికి పోటీ పడబోతున్న హిల్లరీ క్లింటన్ డిమాండ్ చేశారు. అమెరికాలో నిర్వహించిన మహిళా సదస్సులో ఆమె మాట్లాడుతూ, ప్రపంచ వ్యాప్తంగా పురుషులతో సమానంగా మహిళలకు ఆర్థిక సమానత్వం కల్పించాలని అన్నారు. పురుషులతో వేతనాల్లో సమానత్వం సాధించేందుకు భారత్, బంగ్లాదేశ్, లైబీరియా వంటి దేశాల్లో మహిళలు ఎంచుకున్న పలు విధానాలను ఆమె సదస్సు ముందుంచారు. మార్పుకు మహిళలే ప్రధాన మాధ్యమాలు కావడం ప్రపంచ వ్యాప్తంగా చూస్తున్నామని, అయితే బాధ్యతను స్త్రీ, పురుషులిద్దరూ సమానంగా పంచుకోవాలని ఆమె కోరారు. ప్రపంచ ఆర్థిక వేదిక వెల్లడించిన 142 దేశాల సమానత్వ సూచికలో అమెరికా 65వ స్థానంలో నిలవడంపై ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

More Telugu News