: గోవా తీరంలో భారత్, ఫ్రాన్స్ సంయుక్త నౌకా విన్యాసాలు

గోవా తీరంలో భారత్, ఫ్రాన్స్ నావికాదళాలు సంయుక్తంగా విన్యాసాలు (వరుణ-2015) నిర్వహించాయి. ఈ విన్యాసాలు మే 2 వరకు జరుగుతాయి. ఫ్రాన్స్ కు చెందిన నాలుగు యుద్ధ నౌకలు ఈ విన్యాసాల్లో పాల్గొన్నాయి. భారత్ తరపున పాల్గొన్న నౌకల్లో విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విరాట్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఫ్రాన్స్ కు చెందిన అగ్రగామి ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ చార్లెస్ డి గాల్ కూడా ఈ విన్యాసాల్లో అలరించనుంది. ఈ వాహక నౌక అణు శక్తితో నడుస్తుంది. భారత్ తరపున ఢిల్లీ క్లాస్ డెస్ట్రాయర్, రెండు ఫ్రిగేట్లు, ఇంధన నౌక దీపక్, షిశుమార్ క్లాస్ సబ్ మెరైన్, సీ హారియర్ ఫైటర్ ప్లేన్లు, పీ81 గస్తీ విమానాలు ఈ విన్యాసాల్లో పాల్గొంటాయి. ఇరు దేశాల మధ్య సంబంధాల బలోపేతం కోసం ఈ విన్యాసాలు నిర్వహిస్తున్నారు.

More Telugu News