: నెట్ కనెక్షన్ లేకుండానే స్మార్ట్ ఫోన్లలో రానున్న దూరదర్శన్ చానల్స్!

అతి త్వరలో మీ స్మార్ట్ ఫోన్లలో దూరదర్శన్ అందించే అన్ని టెలివిజన్ చానల్స్ నూ ఎటువంటి ఇంటర్నెట్, బ్రాడ్ బ్యాండ్, వైఫై కనెక్షన్ లేకుండా తిలకించే సదుపాయం కలుగనుంది. ఈ మేరకు ప్రసార భారతి, తాము తయారు చేసిన బ్లూ ప్రింట్ ను సమాచార, పౌరసంబంధాల మంత్రిత్వ శాఖకు సమర్పించింది. ఈ ప్రతిపాదనలు అమలు చేస్తే ప్రైవేటు చానల్స్ తో పోటీపడలేక చతికిలబడ్డ దూరదర్శన్ చానళ్లు తిరిగి అత్యధిక వ్యూవర్ షిప్ సాధించే అవకాశం లభిస్తుందని భావిస్తున్నట్టు ప్రసార భారతి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జవహర్ సర్కార్ వివరించారు. తొలిదశలో 20 వరకూ ఉచిత చానళ్లు అందించాలని భావిస్తున్నట్టు తెలిపారు. వీటిల్లో దూరదర్శన్ అందిస్తున్న చానళ్లతో పాటు పాప్యులర్ చానళ్లు కూడా ఉంటాయని పేర్కొన్నారు. ఓ చిన్న డాంగిల్ ను ఫోన్ కు అమర్చడం ద్వారా టీవీ కార్యక్రమాలు వీక్షించవచ్చని తెలిపారు. శాంసంగ్, యాపిల్, మైక్రోసాఫ్ట్ వంటి సంస్థలు ఈ డాంగిల్ ను సులభంగా స్మార్ట్ ఫోన్లోనే అమర్చవచ్చని తెలియజేశారు. ఇందుకు అవసరమైన సాంకేతికత ఇప్పటికే అందుబాటులో ఉన్నందున అనుమతులు రాగానే ముందడుగు వేస్తామని ఆయన అన్నారు.

More Telugu News