: సొంతంగా విద్యుత్ ను తయారుచేసుకునే డిజిటల్ కెమెరా... కొలంబియాలో ఎన్ఆర్ఐ సృష్టి

కొలంబియా శాస్త్రవేత్తలు మరో ఘనతను సాధించారు. ప్రపంచంలోనే తొలిసారిగా తనంతట తానే విద్యుత్తును తయారు చేసుకునే డిజిటల్ కెమెరాను తయారు చేశారు. భారత సంతతి శాస్త్రవేత్త కె.నాయర్ నేతృత్వంలోని బృందం, తనపై పడే కాంతిని కొలుస్తూ, దాన్ని స్వీకరించి విద్యుచ్ఛక్తిగా మార్చే ఓ పిక్సెల్‌ ను తయారు చేసింది. ఓ చిన్న చిప్ లాంటి ఇమేజ్ సెన్సార్‌ ను డిజిటల్ కెమెరాకు అమర్చడం ద్వారా, కాంతి పడ్డప్పుడు పిక్సెల్‌ లోని ఫోటోడయోడ్ విద్యుత్తును తయారు చేసుకుంటుందని బృందంలోని శాస్త్రవేత్తలు వివరించారు. ఫొటో వోల్టాయిక్ విధానంలో విద్యుత్ తయారవుతుందని చెప్పారు. కాగా, ప్రతి పిక్సెల్ కేవలం రెండు ట్రాన్సిస్టర్లతోనే డిజైన్ కావడం గమనార్హం.

More Telugu News