: చెరిగిపోతున్న గుజరాత్ యువకుల హనీమూన్ కలలు!

వివాహం చేసుకొని ఆనందంగా ఉండాలన్న గుజరాత్ యువకుల హనీమూన్ కలలు కలలుగానే మిగిలిపోతున్నాయి. స్త్రీ, పురుషుల మధ్య లింగ నిష్పత్తి గణనీయంగా తగ్గిపోవడమే ఇందుకు ప్రధాన కారణం. ప్రస్తుతం గుజరాత్ లో ప్రతి 1000 మంది పురుషులకు 919 మంది మహిళలు ఉండగా, 6 సంవత్సరాలలోపు చిన్నారుల విషయానికి వస్తే, ప్రతి 1000 మంది బాలురకు 886 మంది బాలికలు ఉన్నట్టు 2011 జనాభా లెక్కలు చెబుతున్నాయి. ఈ నాలుగేళ్ళలో స్త్రీ, పురుషుల మధ్య వ్యత్యాస నిష్పత్తి మరింతగా పెరిగిందని అధికారులు తేల్చడం ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతం గుజరాత్ లో 30 నుంచి 40 సంవత్సరాల మధ్య వయసు ఉండి వివాహం కాని వారి సంఖ్య 6.29 లక్షలకు చేరింది. వీరిలో ఉన్నత చదువులు చదివి మంచి సంపాదన కలిగినవారు వుండటం గమనించదగిన విషయం. సమస్య పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రచారం ఆశించిన ఫలితాలు ఇవ్వడం లేదనేది స్పష్టమవుతోంది.

More Telugu News