: రంగులు మార్చే చీర... ధర్మవరం చేనేత కార్మికుడి అద్భుత ఆవిష్కరణ!

వాతావరణాన్ని బట్టి రంగులు మార్చుకోవడం ఒక్క ఊసరవెల్లికే సాధ్యమని మనకు తెలుసు. అయితే ధర్మవరం పట్టణానికి చెందిన చేనేత కార్మికుడు పెద్దయ్యగారి మోహన్ చేతుల్లో రూపుదిద్దుకున్న 'పద్మవర్షిణి' డిజైనర్ పట్టు చీర, తానూ రంగులు మారుస్తానంటోంది. పట్టు వస్త్రాల తయారీలో చేయి తిరిగిన మోహన్, వాతావరణాన్ని బట్టి రంగులు మారే చీరను నేశారు. ధర్మవరంలోని పద్మారవింద హ్యాండ్ లూమ్స్ అధినేత బీరే ప్రసాద్ సహకారంతో మోహన్ ఈ చీరను నేశారు. ఇందుకోసం 15 మంది కార్మికులతో కలిసి మోహన్ మూడు నెలల పాటు శ్రమించారు. చీర తయారీలో వాడిన 180 గ్రాముల రేషం, వాతావరణాన్ని బట్టి చీర రంగులను మార్చేస్తుందట. ముత్యాలు, 45 రకాల విలువైన రత్నాలతో మోహన్ రూపొందించిన ఈ చీర ధర రూ.38 వేలట. చీర తయారీకి రూ.33 వేలు ఖర్చయిందని మోహన్ చెబుతున్నారు.

More Telugu News