: కేవలం నిమిషంలో ఛార్జయ్యే సెల్ ఫోన్ బ్యాటరీ!

కేవలం ఒకే ఒక్క నిమిషంలో ఛార్జయ్యే సెల్ ఫోన్ బ్యాటరీని స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఎలాంటి ప్రమాదానికి గురికాని సురక్షితమైన అల్యూమినియం బ్యాటరీలను తాము కనుగొన్నట్టు వారు వెల్లడించారు. మార్కెట్లో అందరికీ అందుబాటులో ఉన్న లిథియం, ఐయాన్, ఆల్కలైన్ బ్యాటరీల కంటే కూడా ఇవి చౌకైనవి, సురక్షితమైనవీ అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అల్యూమినియంతో తాము తయారు చేసిన బ్యాటరీలు డ్రిల్లింగ్ చేసినా సరే ప్రమాదం ఉండదని యూనివర్సిటీ కెమిస్ట్రీ ప్రొఫెసర్ హోంగ్జీ చాయ్ హామీ ఇస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న బ్యాటరీలు, ఎక్కువ సేపు ఛార్జింగ్ పెడితే పేలిపోవడం మనకు తెలిసిందే. అల్యూమినియం బ్యాటరీలు చౌకగా లభించడమే కాకుండా, కేవలం 60 సెకెండ్లలో ఎక్కువ ఛార్జింగ్ కెపాసిటీ ఉంటుందని ఆయన చెప్పారు. ఈ బ్యాటరీలను అవసరమైతే మడత కూడా పెట్టేసుకోవచ్చని, భవిష్యత్ లో స్మార్ట్ ఫోన్ల అవసరాన్ని బట్టి వీటిని తయారుచేసుకునే వెసులుబాటు ఉంటుందని ఆయన వివరించారు.

More Telugu News