: ఫ్లిప్ కార్ట్, స్నాప్ డీల్ వంటి వెబ్ సైట్లలో ఎక్కువగా అమ్ముడవుతున్న వస్తువులివే!

పలు రకాల మొబైల్ మోడల్స్ మార్కెట్ లోకి ఎప్పటికప్పుడు అందుబాటులోకి వస్తున్న నేపథ్యంలో వాటి కొనుగోళ్లు కూడా అంతే స్థాయిలో పెరిగిపోతున్నాయి. దాంతో పలు ఇ-కామర్స్ వెబ్ సైట్లలో వాటిని కొనేందుకు వినియోగదారులు మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుతకాలంలో ఫ్లిప్ కార్ట్, స్నాప్ డీల్ వంటి వెబ్ సైట్లలో మొబైల్స్, వాటికి సంబంధించిన పరికరాలు ఎక్కువగా అమ్ముడుపోతున్నట్లు ఇంటర్నెట్, మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఐఏఎంఏఐ) తెలిపింది. ఈ ఒక్క మొబైల్ కేటగిరీనే రూ.9,936 కోట్ల (41 శాతం) వ్యాపారం ఇ-టెయిలింగ్ పరిశ్రమకు దోహదం చేస్తోందని పరిశోధనలో వెల్లడైందట. ఆ తర్వాత బాగా అమ్ముడుబోయే కేటగిరీలో చేనేత వస్తువులు, పాదరక్షలు, వ్యక్తిగత వస్తువులు ఉన్నాయని, దాంతో రూ.4,699 (20 శాతం) కోట్ల వ్యాపారం జరుగుతోందట. వంటింటి ఉపకరణాల విషయంలో రూ.3,404 (14 శాతం) కోట్లకు కొనుగోళ్లు జరుగుతున్నాయట. "మిగతా 25 శాతం లాప్ టాప్స్, నెట్ బుక్స్, టాబ్ లెట్స్, హోమ్ ఫర్నిషింగ్స్, పుస్తకాల ద్వారా రూ.2,780 కోట్ల వరకు వ్యాపారమవుతోంది" అని ఐఏఎంఏఐ వివరించింది. 2013 నుంచి 2014 వరకు ఇ-టెయిలింగ్ అమ్మకాలు సుమారు 1.4 రెట్లు పెరిగాయట.

More Telugu News