: కేసీఆర్ సొంతూరులో రైతు ఆత్మహత్య... తెలంగాణలో ఆత్మహత్యల పరంపర

ప్రకృతి ప్రకోపం, సర్కారు అలసత్వ ధోరణితో తెలంగాణలో ఆత్మహత్యల పరంపర కొనసాగుతోంది. భూమిని నమ్ముకున్న రైతన్నలు బలవన్మరణం పాలవుతున్న ఘటనలు రాష్ట్రంలో నిత్యం చోటుచేసుకుంటున్నాయి. సీఎం కేసీఆర్ సొంత జిల్లా మెదక్ లో ఇఫ్పటికే పెద్ద సంఖ్యలో రైతులు ఆత్మహత్యకు పాల్పడగా, తాజాగా ఆయన సొంత గ్రామం చింతమడకలో ఓ రైతు పురుగుల మందు తాగి తనువు చాలించాడు. గ్రామానికి చెందిన రైతు జెల్ల రాజనర్సు తనకున్న నాలుగెకరాల పొలంలో సాగు కోసం అందిన మేరకు అప్పులు చేశాడు. నాలుగేళ్లలో ఏడు బోర్లు వేసినా చుక్క నీరు పడలేదు. అయినా సాగుపై ఆశచావని అతడు ఈ నెల 28న మరో బోరు వేయించాడు. అయితే అందులోనూ నీరు పడలేదు. ఇదే క్రమంలో ఈ ఏడాది వేసిన పంట చేతికందలేదు. బోర్లు, పంట సాగు కోసం చేసిన అప్పులు రూ.6 లక్షలకు చేరుకున్నాయి. ఈ అప్పులను తీర్చే దారి కనిపించక నిన్న సాయంత్రం అతడు గ్రామ శివారులో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.

More Telugu News