: మాస్టర్ బ్లాస్టర్ కు తగ్గని అభిమానం... సచిన్ ను చూసి కేరింతలు కొట్టిన ఎంసీజీ!

మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ క్రికెట్ లో చెరిగిపోని రికార్డులనెన్నింటినో నెలకొల్పాడు. అత్యున్నత పురస్కారం భారతరత్నను దక్కించుకున్న అతడు, దేశంలోనే కాక విశ్వవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు. సుదీర్ఘ క్రికెట్ ఆడిన సచిన్ రెండేళ్ల క్రితం ఆటకు వీడ్కోలు పలికాడు. అయితే అతడు క్రికెట్ లేకుండా జీవించలేడని తేలిపోయింది. ఎక్కడ క్రికెట్ ఈవెంట్లు జరిగినా, అక్కడ వాలిపోతున్నాడు. సచిన్ లాగే అతడి అభిమానులు కూడా అతడిపై ఏమాత్రం ఆసక్తిని కోల్పోలేదు. నిన్న వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ను వీక్షించిన సచిన్, మ్యాన్ ఆప్ ద సిరీస్ అవార్డును ఆసీస్ ఆటగాడు మిచెల్ స్టార్క్ కు అందించాడు. అవార్డు ప్రదానం కోసం ఐసీసీ సచిన్ ను ఆహ్వానించగానే, మెల్ బోర్న్ క్రికెట్ గ్రౌండ్ ఒక్కసారిగా కేరింతలు కొట్టింది. సచిన్ నామస్మరణతో స్టేడియం హోరెత్తింది.

More Telugu News