: టాస్ గెలిచిన న్యూజిలాండ్... బ్యాటింగ్ ఎంచుకుంది!

ప్రపంచ కప్ తుది పోరుకు రంగం సిద్ధం అయింది. మెల్ బోర్న్ లో జరుగుతున్న పోటీలో టాస్ గెలిచిన న్యూజిలాండ్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. రెండు జట్లూ మ్యాచ్ ఫేవరేట్లుగానే బరిలోకి దిగుతున్నాయి. అటు ఆస్ట్రేలియా, ఇటు న్యూజిలాండ్ జట్ల అభిమానులతో మెల్ బోర్న్ గ్రౌండ్ నిండిపోయింది. ఇండియా ఫైనల్ కు చేరుతుందని భావించి ముందే టికెట్లు కొనుగోలు చేసిన పలువురు భారత క్రికెట్ అభిమానులు సైతం స్టేడియంలో సందడి చేస్తున్నారు. జట్ల వివరాలు: ఆస్ట్రేలియా: వార్నర్, ఫించ్, స్టీవెన్ స్మిత్, క్లార్క్, వాట్సన్, మాక్స్‌వెల్, హడిన్, ఫాల్క్‌నర్, జాన్సన్, స్టార్క్, హేజిల్‌వుడ్. న్యూజిలాండ్: బ్రెండన్ మెక్‌కలమ్, గప్తిల్, విలియమ్సన్, రాస్ టేలర్, ఇలియట్, అండర్సన్, రాంకి, వెటోరి, సౌథీ, బౌల్ట్, హెన్రీ.

More Telugu News