: చవకగా విండోస్ స్మార్ట్ ఫోన్ కావాలా?

విండోస్ ఆధారిత స్మార్ట్ ఫోన్ లుమియా 430ని మైక్రోసాఫ్ట్ త్వరలో మార్కెట్లోకి తీసుకురానుంది. బ్రాండెడ్ స్మార్ట్ ఫోన్ సెగ్మెంట్లో ఇది బాగా చవక. దీని ధర 70 డాలర్లు (రూ.4300) మాత్రమేనట. 127 గ్రాముల బరువున్న ఈ డ్యూయల్ సిమ్ ఫోన్ విండోస్ 8.1 ఆపరేటింగ్ సిస్టమ్ పై పనిచేస్తుంది. 4 అంగుళాల టచ్ స్క్రీన్, 8 జీబీ ఇంటర్నల్ మెమరీ, 1.2 గిగాహెర్జ్ డ్యూయల్ కోర్ స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్ కలిగి ఉన్న ఈ ఫోన్ లో 1500 ఎంఏహెచ్ బ్యాటరీ పొందుపరిచారు. అయితే, కెమెరా విషయంలోనే కాస్తంత నిరాశ తప్పదు. ఎందుకంటే, కేవలం 2 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 0.3 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా మాత్రమే దీంట్లో ఉన్నాయి. కానీ, మిగతా ఫీచర్స్, తక్కువ ధర దృష్ట్యా ఇది పరిగణనలోకి తీసుకోదగ్గ ఫోనే అని టెక్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

More Telugu News