: వేసవి వేడికి చర్మం పాడైపోతుందని భావిస్తున్నారా? అయితే ఈ ప్యాక్స్ వేసుకోండి

వేసవి ప్రారంభమైంది. ఎండలు మండిపోతున్నాయి. బయటకు వెళ్దామంటే భయమేస్తోంది. మరి, ఆఫీసు పని, ఇతర వ్యాపకాల కారణంగా ఇంట్లోనే ఉందామంటే వీలుకాదు. ఎండలో తిరిగితే చర్మం కమిలిపోతుంది, చర్మాన్ని సంరక్షించుకోవడం ఎలా, అని చింతిస్తున్నారా? భయపడకండి. నేచురల్ గా చర్మసంరక్షణను నిపుణులు సూచిస్తున్నారు. సీజనల్ ఫ్రూట్స్ తో మాయిశ్చరైజర్ ప్యాక్స్ తయారు చేసుకోవాలని చెబుతున్నారు. పావుకప్పు పుచ్చకాయ జ్యూస్, పావు కప్పు ఆరెంజ్ జ్యూస్, పావు కప్పు క్యారెట్ జ్యూస్ ను ఓ గిన్నెలో తీసుకుని బాగా కలపాలి. అందులో ఓ రెండు చుక్కల నిమ్మరసం, టీ స్పూను తేనె కలిపి ఐదు నిమిషాలు ఫ్రిజ్ లో ఉంచాలి. చల్లగా ఉన్న ఆ ద్రావణాన్ని ముఖంపై, మెడపై రాయాలి. ప్యాక్ ఆరిపోయాక గోరువెచ్చని నీటితో ముఖం కడుక్కోవాలి. కొంతసేపటి తర్వాత మరోసారి ప్యాక్ వేసుకోవాలి. అలా చేయడం వల్ల విటమిన్స్ ముఖంలోకి ప్రవేశించి కొత్త కాంతి వస్తుందట. అలా రోజులో రెండు సార్లు రాయాలి. టాన్ పేరుకుపోయి ఉంటే బాదం పప్పులను నానబెట్టి పేస్ట్ చేయాలి. అందులో రెండు టీ స్పూన్ల గడ్డపెరుగు, పుచ్చకాయ జ్యూస్ ను కలిపి ఆ మిశ్రమాన్ని ముఖం, మెడపై రాయాలి. ఆరిపోయాక గోరువెచ్చని నీటితో కడిగితే టాన్ పోతుంది. ఎండ వేడిమికి కళ్లు ఎర్రబారి మంటలు వస్తే పుచ్చకాయ, లేదా, కీర దోసను తరిగి కళ్లపై పెట్టుకుంటే ఉపశమనం పొందవచ్చు. వేసవిని ఇలా ఎదుర్కొంటే సమస్యలు ఉండవని నిపుణులు చెబుతున్నారు.

More Telugu News