: గురుగ్రహం 'చంద్రుడి'పై మహా సముద్రం ఉందంటున్న నాసా... అక్కడ జీవరాశి ఉందన్న వాదనకు బలం

గురుగ్రహం కక్ష్యలోని ఉపగ్రహం (చంద్రుడు) గ్యానమిడ్ పై జీవరాశి ఉందన్న వాదనకు క్రమంగా బలం చేకూరుతోంది. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా జరిపిన పరిశోధనలు ఈ వాదనకు బలం చేకూరుస్తున్నాయి. హబుల్ టెలీస్కోపు ఆధారంగా నాసా జరిపిన పరిశీలనలో గ్యానమిడ్ ఉపరితలాన్ని కప్పేసిన మంచుపొర కింద మహా సముద్రముందని తేలింది. ఈ మేరకు సముద్ర ఆనవాళ్లపై మరింత మేర సమాచారం లభ్యమైందని నాసా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మహా సముద్రం ఉన్న మాటే నిజమైతే, ఆ ఉపగ్రహంపై జీవరాశి కూడా ఉన్నట్టేనని నాసా అభిప్రాయపడుతోంది. అయితే ఈ ఉపగ్రహం ఉపరితలంపై తాము కనుగొన్న సముద్రంపై మరింత పరిశోధనలు చేసి నిర్ధారించాల్సి ఉందని నాసా శాస్త్రవేత్తలు మీడియాకు వెల్లడించారు.

More Telugu News