: జీ మెయిల్ తో కంట్రోల్ చేసేలా ఆండ్రాయిడ్ లాలీపాప్ 5.1 వెర్షన్ విడుదల

స్మార్ట్ ఫోన్ ఆపరేటింగ్ వ్యవస్థల్లో సరికొత్త ఆండ్రాయిడ్ వెర్షన్ విడుదల చేసినట్టు గూగుల్ ప్రకటించింది. ఇది లాలీపాప్ సిరీస్ లో 5.1 వెర్షన్ అని, దీని ద్వారా హై డెఫినిషన్ ధ్వని సాధ్యమవుతుందని, మొబైల్ ఫోనుకు మరింత భద్రత లభిస్తుందని గూగుల్ తన అధికారిక బ్లాగులో వివరించింది. ఈ సిస్టంతో పని చేసే స్మార్ట్ ఫోన్ ను, రిజిస్టర్ చేసుకున్న జీ మెయిల్ ద్వారా లాక్, అన్ లాక్ చేసుకోవచ్చని ప్రకటించింది. ఫోన్ పోగొట్టుకున్నప్పుడు, లేదా, దొంగతనం జరిగినప్పుడు ఎవరైనా ఫోనును ఫ్యాక్టరీ సెట్టింగ్స్ కు రీసెట్ చేసినప్పటికీ, యజమాని తన గూగుల్ ఖాతాలోకి ప్రవేశించిన తరువాతనే ఫోన్ పనిచేస్తుందని తెలిపింది.

More Telugu News