: ఎంత తింటున్నారో తెలియడం లేదా?... దీన్ని ధరిస్తే ఇక ఆ బెంగ ఉండదు!

ఆఫీసుల్లో కూర్చుని గంటల తరబడి పని చేయడం, తగినంత శారీరక శ్రమ లేకపోవడం వంటి కారణాలతో ఊబకాయం, మధుమేహం వంటి సమస్యలతో ఎక్కువ మంది బాధపడుతున్నారు. దీంతో కేలరీలను లెక్కించుకుంటూ తినాల్సిన పరిస్థితి! వైద్యులు ఎంతెంత తినాలో చెబుతున్నప్పటికీ, రోజూ లెక్కలేసుకోవడం కాస్త కష్టమే. ఈ నేపథ్యంలో కాలిఫోర్నియా యూనివర్సిటీ పరిశోధకులు డైట్ చోకర్ అనే నెక్లెస్ ను కనిపెట్టారు. దీనిని సెల్ ఫోన్ కు అనుసంధానిస్తారు. భోజనం చేసే సమయంలో దీనిని ధరిస్తే, భోజనం చేసేటప్పుడు గొంతు వద్ద కలిగే ప్రకంపనల ఆధారంగా ఎన్ని కేలరీలు తీసుకున్నామనేది చెబుతుంది. ద్రవ పదార్థమైతే ఒకలా, ఘన పదార్థమైతే మరోలా గొంతు స్పందిస్తుందని, గొంతు స్పందనలను బట్టి, పదార్థాలు ఏవైనా, వెచ్చగా, లేదా చల్లగా ఉన్నా ఇది కేలరీలను కచ్చితంగా లెక్కిస్తుందని పరిశోధకులు తెలిపారు. మార్కెట్ లో ఉన్న చాలా పరికరాల కంటే ఇది మేలైనదని పరిశోధకులు భరోసా ఇస్తున్నారు. కాగా, దీనిని నెక్లెస్ లో ధరించే విధంగా రూపుదిద్దే పనిలో పరిశోధకులు బిజీగా ఉన్నారు.

More Telugu News