: ఖండాలు దాటి వచ్చి తెనాలి వధువును మనువాడిన జర్మన్

వివాహం రెండు మనసుల్నే కాదు...రెండు కుటుంబాలను, రెండు దేశాలను కూడా ఏకం చేసింది. మనసిచ్చిన యువతి కోసం ఖండాలు దాటి మరీ మూడుముళ్ళతో ఏకమయ్యాడో జర్మనీ యువకుడు. వివరాల్లోకి వెలితే... తెనాలి చెంచుపేటకు చెందిన పావులూరి సత్యన్నారాయణ, గాయత్రిదేవి దంపతులకు పావని, రాజేష్‌ పిల్లలు. పావని ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉద్యోగ నిమిత్తం నాలుగేళ్ల క్రితం జర్మనీ వెళ్లింది. అక్కడ ఆమె పనిచేసే సంస్థలో స్థానిక లెన్‌జ్ కొన్‌ రాడ్ ష్విష్‌ టన్ బర్గ్ కూడా విధులు నిర్వర్తిస్తున్నాడు. సుదీర్ఘ సహచర్యంలో పావనిని ప్రేమించిన ష్విష్‌ టన్ బర్గ్ ఆమెతో జీవితం పంచుకోవాలని భావించాడు. దీంతో ఆమెకు తన నిర్ణయం తెలిపాడు. తల్లిదండ్రులు ఆమోదిస్తే తనకు అభ్యంతరం లేదన్న పావని నిర్ణయాన్ని బర్గ్ తన తల్లిదండ్రులు క్లవ్‌ స్ ష్విష్‌ టన్ బర్గ్, మార్టిన్ ఎఫ్ మర్ట్‌ కు వివరించాడు. వారు పావని తల్లిదండ్రులతో మాట్లాడి ఒప్పించడంతో, తెనాలిలోని చెంచుపేట చావాస్ గ్రాండ్‌ లో హిందూ సాంప్రదాయ పద్ధతిలో వివాహం చేశారు. రెండు దేశాల పెద్దలతో వివాహ వేడుక కనుల పండువగా జరిగింది.

More Telugu News