: 'యాదగిరిగుట్ట' పేరు మార్చిన కేసీఆర్, చిన్నజీయర్

తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట పేరు మారిపోయింది. ఇకపై ఇది 'యాదాద్రి'గా పిలువబడబోతోంది. ఈ మేరకు చిన్నజీయర్ స్వామి నామకరణం చేశారు. ఆగమశాస్త్రం ప్రకారమే యాదగిరిగుట్ట అభివృద్ధికి ప్రతిపాదనలు చేస్తున్నట్టు చిన్నజీయర్ తెలిపారు. ఆలయ పవిత్రత, సంప్రదాయం చెక్కుచెదరకుండా చూస్తామని చెప్పారు. ఇతర గుట్టల పేర్లను కూడా మారుస్తామని వెల్లడించారు. ఇదే సమయంలో కేసీఆర్ మాట్లాడుతూ, రాయగిరి, యాదగిరిగుట్ట చెరువులను పర్యాటక కేంద్రాలుగా మారుస్తామని తెలిపారు. యాదగిరిగుట్ట చుట్టూ ఉన్న మరో 8 గుట్టలను కలిపి 'నవ గిరులు'గా తీర్చిదిద్దుతామన్నారు. గుట్టపైన 30 నర్సింహుని రూపాలను ప్రతిష్ఠిస్తామని చెప్పారు. గుట్టమీద 100 వాహనాలు, గుట్ట కింద 5 వేల వాహనాలు పార్క్ చేసేలా నిర్మాణాలు చేపడతామని అన్నారు. డిజెైన్ కోసం అనుభవజ్ఞుల సలహాలు స్వీకరించామని... గుట్టలో మండల దీక్షకు హాలు నిర్మిస్తామని కేసీఆర్ వెల్లడించారు.

More Telugu News