: గత రెండేళల్లో 100% పెరిగిన ఆన్ లైన్ కొనుగోళ్లు

భారతదేశంలో స్మార్ట్ ఫోన్ ద్వారా ఆన్ లైన్ లో కొనుగోళ్లు గత రెండు సంవత్సరాల్లో వంద శాతం పెరిగాయని వెల్లడైంది. దాంతో ఈ-కామర్స్ లో ఊర్ధ్వముఖపు పోకడ కనిపిస్తోందని, ఈ క్రమంలో ఆన్ లైన్ కొనుగోళ్లు ప్రయోజనకరంగా మారాయని తెలిసినట్టు 'మాస్టర్ కార్డ్ ఆన్ లైన్ షాపింగ్ సర్వే-2014' ఓ నివేదిక విడుదల చేసింది. ఆసియా పసిఫిక్ లోని 14 దేశాల్లో జరిపిన సర్వేలో ఈ విషయం బయటపడింది. 70.1 శాతంతో మొబైల్ షాపింగ్ లో చైనా తొలి స్థానంలో నిలిచింది. చాలావరకు మొబైల్ ఉపయోగించే షాపింగ్ చేస్తున్నట్టు పోలింగ్ లో తెలిపారు. భారత్ 62.9 శాతం, తైవాన్ 62.6 శాతం, థాయ్ లాంగ్ 58.8 శాతం, ఇండోనేషియా 54.9 శాతంతో తొలి ఐదు స్థానాల్లో నిలిచాయి. భారత్ లో దుకాణాలకు వెళ్లి మరీ షాపింగ్ చేసే సామర్థ్యం 47.7 శాతం మాత్రమే ఉందని సర్వే వెల్లడించింది. అయితే యాప్ లు అందుబాటులోకి వచ్చాక షాపింగ్ (45.3 శాతం మంది) చేసేవారికి అత్యంత సౌకర్యంగా మారిందని వివరించింది. ఈ షాపింగ్ స్మార్ట్ ఫోన్ ద్వారా కొనుగోలు చేసే వస్తువుల్లో మొబైల్ ఫోన్ లు లేదా మొబైల్ గాడ్జెట్ యాప్స్ (28.8 శాతం)లు ఎక్కువగా ఉన్నాయట. తరువాత థియేటర్ కు వెళ్లి సినిమా చూసేందుకు మూవీ టికెట్ల (26.7 శాతం) కొనుగోలు, బట్టలు, ఫ్యాషన్ వస్తువులను (24 శాతం) కొంటున్నట్టు సర్వే పేర్కొంది. ఇక ఆన్ లైన్ లావాదేవీల కోసం సాధారణంగా డెబిట్ కార్డు, క్యాష్ ద్వారానే చెల్లింపులు జరుగుతున్నాయట.

More Telugu News