: ఆంధ్రప్రదేశ్ మెడికల్ ఫీజుల విధానంలో మార్పులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మెడికల్ ఫీజుల విధానంలో ప్రభుత్వం మార్పులు చేసింది. 'ఏ' కేటగిరీ ఫీజును 60 వేల రూపాయల నుంచి 50 వేల రూపాయలకు తగ్గించింది. 'బీ' కేటగిరీ ఫీజును 11 లక్షల రూపాయలుగా నిర్ణయించారు. ఈ కేటగిరీలో 35 శాతం సీట్లను రిజర్వ్ చేసినట్టు తెలిపింది. 'సీ' కేటగిరీ కింద 15 శాతం సీట్లను రిజర్వ్ చేశారు. ఈ కోటాను ఎన్ఆర్ఐ కోటాగా అభివర్ణిస్తారు. యాజమాన్య కోటా ప్రవేశ పరీక్షలను ప్రభుత్వమే నిర్ణయించనుంది. సీ కేటగిరీ, యాజమాన్య కోటా ఫీజుల వివరాలను ప్రభుత్వం వెల్లడించకపోవడం విశేషం.

More Telugu News