: రాజధానికి 50 వేలు...స్మార్ట్ సిటీకి 30 వేలు...నాశనం కాక మరింకేంటి?

భావితరాల జనజీవనంపై ప్రమాద ఘంటికలు మ్రోగుతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే అడవులు అంతరించిపోతున్నాయి. అందినంత మేర భూమిని మనిషి ఆక్రమించుకుంటున్నాడని, జీవుల మధ్య సమతౌల్యత దెబ్బతిందని, దీని ప్రభావం మరో 20 ఏళ్లలో కనిపించే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనికి సజీవ సాక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నిలుస్తోందని వారు చెబుతున్నారు. రాజధాని నిర్మాణానికి 50 వేల ఎకరాల శ్రేష్ఠమైన సాగుభూమిని సేకరించారు. అలాగే స్మార్ట్ సిటీగా విశాఖను తయారు చేసేందుకు 30 వేల ఎకరాలు సేకరించనున్నారు. ఈ లెక్కన ఎంత సాగుభూమి నాశనమవుతుందని వారు ప్రశ్నించారు. ఫార్మా ఇండస్ట్రీ కోసం మరిన్ని ఎకరాలు సేకరించనున్నారు. భూమిని నమ్ముకున్నవారంతా తరువాత ఏం చేస్తారు? భూమిని సేకరించేవారంతా వారికి పునరావాసం కల్పిస్తే సరిపోతుందనే భ్రమల్లోనే ఉంటున్నారని, అసలు సమస్యలు పునరావాసంతో పరిష్కారం కావని, సుదీర్ఘ తీరప్రాంతం ఉన్న ఆంధ్రప్రదేశ్ ను ఎప్పుడు ఏ ముప్పు ముంచుతుందో తెలియని పరిస్థితి నెలకొందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అభివృద్ధి పేరిట జరిగిన దారుణాలే ఉత్తరప్రదేశ్ లో మారణహోమానికి దారితీశాయని వారు హెచ్చరిస్తున్నారు. రుతువులు మారిపోతున్నాయి. అకాల వర్షాలు పంటల్ని ముంచేస్తున్నాయని వారు సూచిస్తున్నారని తెలిపారు.

More Telugu News