: బ్రెజిల్ లో వాట్స్ యాప్ నిషేధించాలని ఆదేశం

తక్షణ సందేశాన్ని పంపించే వ్యవస్థగా ప్రపంచవ్యాప్తంగా పేరొందిన వాట్స్ యాప్ పై బ్రెజిల్ లో నిషేధం విధించారు. ఓ దర్యాప్తు వ్యవహారంలో సదరు సోషల్ మీడియా సహకరించని కారణంగా స్థానిక జడ్జి లూయిజ్ డి మౌరా కొర్రియా ఈ నెలలో ఆదేశించారు. ఓ కేసుకు సంబంధించి ఈ నిర్ణయం తీసుకోవడంతో మిగతా వివరాలను జడ్జి వెల్లడించలేదు. ఈ కేసు పిల్లల లైంగిక గ్రాఫిక్ ఫొటోలకు సంబంధించినదని ఓ ప్రెస్ అధికారి చెప్పారు. ఈ విషయం చాలా రహస్యంగా ఉండాల్సిందని, అంతర్గతంగా నిబంధనలు పాటించాల్సి ఉందని వివరించారు. దానిపై వాట్స్ యాప్ యాజమాన్యం ఎలాంటి స్పందన చేయలేదు. బ్రెజిల్ లో వాట్స్ యాప్ కు సొంత కార్యాలయం లేని కారణంగా మొబైల్ వినియోగదారులకు మాత్రమే నిషేధం వర్తించనుంది. వెబ్ సైట్ నిలిపివేత వల్ల వ్యక్తిగత, వృత్తిపరంగా యాప్ ను ఉపయోగించే లక్షల మంది బ్రెజిలియన్లకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆపరేటర్ల తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న ఒకరు అంటున్నారు.

More Telugu News