: ఈ ఏడాది మార్కెట్ లోకి వెయ్యికి పైగా కొత్త మొబైల్ మోడళ్లు

ప్రస్తుత కాలంలో గాడ్జెట్ లకు విపరీతమైన క్రేజ్. ముఖ్యంగా మొబైల్స్ అంటే ఇంకా మక్కువ. మార్కెట్ లోకి కొత్తరకం మోడల్ రాగానే ఇట్టే జనం ఆసక్తి చూపుతారు. ఈ క్రమంలో జియామి, ఆసుస్, మోటొరోలా, ఒబి తదితర మొబైల్ ఫోన్ బ్రాండ్లు భారత్ లో తమ మార్కెట్ షేర్ పెంచుకోవాలనుకుంటున్నాయి. ఈ ఏడాది మార్కెట్ లో దాదాపు 1,400 నుంచి 1,500 కొత్త మోడల్స్ రాబోతున్నాయట. "2015లో మేము 1,400 నుంచి 1,500ల ఫోన్లను విడుదల చేయాలని అనుకుంటున్నాం. గతేడాది కన్నా ఈ ఏడాది 20 శాతం మోడల్స్ పెరగనున్నాయి" అని 91mobiles.com తెలిపింది. గతేడాది మొత్తం 1,137 ఫోన్లను లాంఛ్ చేశారు.

More Telugu News