: ఈ వజ్రాలు ఉండేది కాళ్ల కిందే!

అవి అత్యంత ఖరీదైన వజ్రాలు. అయితేనేం, అవి ఉండేది కాళ్ల కిందే. ఎందుకంటే, ఆ వజ్రాలను ఓ జత బూట్లలో పొదిగారు కాబట్టి. వివరాల్లోకి వెళితే, సూరత్‌ లోని అత్వాలైన్స్‌ లో ఒక జత బూట్లను 12,000 డైమండ్లతో తయారు చేశాడో వ్యాపారి. ఒక్కో బూటుకు 6,000 డైమండ్లు ఉపయోగించగా, వీటి తయారీకి రెండు నెలల సమయం పట్టిందని తెలిపాడు. డైమండ్లతో బూట్లను తయారు చేయాలని దుబాయ్‌కు చెందిన ఓ వ్యక్తి ఆర్డర్ ఇచ్చారని ఆయన తెలిపారు. కాగా, భారత్‌ లో వజ్రాలతో కూడిన వస్తువుల తయారీకి డిమాండ్ రోజురోజుకూ పెరుగుతోందని తెలుస్తోంది.

More Telugu News