: పాకిస్థాన్ కు బాధ కలిగితే చైనాకు బాధ కలిగినట్టేనట!

భారత్ వైరి దేశాలు చైనా, పాకిస్థాన్ ల మధ్య స్నేహం పెరుగుతోందా? అంటే, అవుననే భావించకతప్పదు. చైనా నేతలు పాక్ పై ఆప్యాయతానురాగాలు కురిపిస్తున్నారు. పొలిట్ బ్యూరో సభ్యుడు మెంగ్ జియాంగ్ ఝౌ మాట్లాడుతూ, పాక్ తో చైనా అనుబంధం వ్యక్తుల స్థాయికి మించినదని తెలిపారు. పాక్ సమస్యను చైనా తన సమస్యగానే భావిస్తుందని తెలిపారు. మరో నేత యు ఝెంగ్ స్ఫెంగ్ పాకిస్థాన్ ను అత్యంత విశ్వసనీయ మిత్రుడిగా అభివర్ణించారు. పాక్ కు చైనా సర్కారు, ప్రజానీకం అన్ని విధాలా సాయపడతారని వివరించారు. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి కూడా పాక్ పై ప్రేమ ప్రదర్శించారు. పాకిస్థాన్ సర్వకాలాల్లోనూ మిత్రదేశమేనని పేర్కొన్నారు. చైనా, పాక్ లతో భారత్ కు సరిహద్దుల విషయమై ఎన్నో వివాదాలున్న సంగతి తెలిసిందే.

More Telugu News