: అమెరికాను వణికిస్తున్న మంచు తుపాను

గత రెండు రోజులుగా మంచు తుపాను అమెరికాను కుదిపేస్తోంది. పలు ప్రాంతాల్లో మూడు అడుగుల మేర మంచు పేరుకుపోవడంతో రవాణా స్తంభించిపోయింది. ఈ నేపథ్యంలో, న్యూజెర్సీ స్టేట్ లో ఎమర్జెన్సీ ప్రకటించారు. విద్యుత్ సరఫరా నిలిపివేశారు. న్యూజెర్సీ, న్యూయార్క్, బోస్టన్, కనెక్టికట్ ప్రాంతాల్లో మంచు తుపాను తీవ్ర ప్రభావం చూపుతోంది. ఆఫీసులు, పాఠశాలలు మూసివేయగా, ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. అటు న్యూయార్క్, బోస్టన్, ఫిలడెల్ఫియా విమానాశ్రయాలను మూసివేశారు. రైళ్ల రాకపోకలను కూడా రద్దు చేశారు. లక్షల మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. "ఇంత భారీగా మంచుతుపాను విరుచుకుపడడం ఈ సిటీ చరిత్రలో ఇదే కావచ్చు" అని న్యూయార్క్ మేయర్ బిల్ డి బ్లాసియో అంటున్నారు.

More Telugu News