: వాట్స్ యాప్ కంప్యూటర్ వెర్షన్ విడుదల

ప్రపంచ వ్యాప్తంగా 70 కోట్ల మంది ఖాతాదారులతో మొబైల్ చాటింగ్, షేరింగ్ సేవలందిస్తున్న సోషల్ నెట్ వర్కింగ్ యాప్ 'వాట్స్ యాప్' తన డెస్క్ టాప్ వెర్షన్ ను విడుదల చేసింది. కోట్లాది మంది వాట్స్ యాప్ వినియోగదారుల కోరిక మేరకు దీన్ని అభివృద్ది చేసినట్టు సంస్థ తెలిపింది. కొత్త సేవలకు 'వాట్స్ యాప్ వెబ్' అని పేరు పెట్టినట్టు తెలిపింది. కంప్యూటర్ పై వాట్స్ యాప్ వాడుకోవాలంటే మొబైల్ లో వున్న వాట్స్ యాప్ నుంచి https://web.whatsapp.com/ వెబ్ సైట్ లో కనిపించే కోడ్ ను స్కాన్ చేయాల్సి ఉంటుంది. కంప్యూటర్ పై వాట్స్ యాప్ వాడుకున్నా ఆ సమాచారం ఎప్పటికప్పుడు మొబైల్ లో స్టోర్ అవుతుందని పేర్కొంది.

More Telugu News