: 'జిప్ డయల్'ను కొనుగోలు చేసిన ట్విట్టర్

భారత మొబైల్ మార్కెటింగ్ సంస్థ 'జిప్ డయల్'ను సోషల్ నెట్వర్కింగ్ వెబ్ సైట్ ట్విట్టర్ సొంతం చేసుకుంది. దాదాపు 30 నుంచి 40 మిలియన్ డాలర్ల వరకు కొనుగోలు ఒప్పందం కుదిరినట్టు సమాచారం. ఈ విషయాన్ని జిప్ డయల్ తన వెబ్ సైట్, ట్విట్టర్ ఖాతాలో స్వయంగా వెల్లడించింది. అటు ట్విట్టర్ ఇండియా కూడా తన ఖాతాలో ఈ ఒప్పందం గురించి ట్వీట్ చేసింది. దేశ వ్యాప్తంగా ప్రజలతో మరింత అందుబాటులో ఉండేందుకు జిప్ డయల్ ను సొంతం చేసుకున్నామని చెప్పారు. బెంగళూరుకు చెందిన ఈ జిప్ డయల్ మార్కెటింగ్ ప్రచారం కోసం తమ క్లయింట్లకు ఫోన్ నంబర్లను సేకరిస్తుంది. దాంతో వినియోగదారులు కొన్ని నంబర్లకు కాల్ చేయగా, కనెక్ట్ అయ్యే ముందు కాల్ హ్యాంగ్ అవుతుంది. తరువాత వారికి సమాచారానికి సంబంధించిన సమాధానం ప్రమోషన్ రూపంలో ఉన్న టెక్స్ట్ మెసేజ్ వస్తుంది.

More Telugu News