: ఒబామాకు కానుకగా... సిరిసిల్ల నేతన్న అరుదైన చీర!

భారత పర్యటనకు వస్తున్న అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాకు తెలంగాణ నుంచి అరుదైన కానుక వెళుతోంది. కరీంనగర్ జిల్లా సిరిసిల్లలో పలుచటి చీరల తయారీకి పేరుగాంచిన నేత కార్మికుడు విజయ్, ఒబామాకు బహుమతిగా అందించేందుకు అతి పలుచటి, అగ్గిపెట్టెలో పట్టే చీరను నేశాడు. ఆకుపచ్చ వర్ణంలో ఉన్న సదరు చీరను విజయ్, కొద్దిసేపటి క్రితం ఓ తెలుగు ప్రైవేట్ టీవీ ఛానెల్ లో ప్రదర్శించాడు. బెంగళూరు నుంచి తెప్పించిన పట్టుతో అతి పలుచటి చీరలను తయారు చేయడంలో విజయ్ కుటుంబానికి నేత కార్మికుల్లోనే పేరు ప్రఖ్యాతులున్నాయి. విజయ్ తండ్రి కూడా ఈ తరహాలో పలు చీరలను నేసి కీర్తిగాంచారు. తాజాగా భారత పర్యటనకు వస్తున్న ఒబామాకు బహూకరించేందుకు విజయ్ ఈ చీరను నేశాడు. అరుదైన ఈ చీరను స్వీకరించనున్న ఒబామా, దానిపై ఎలా స్పందిస్తారో చూడాలి.

More Telugu News