: బల్గేరియాలో ఆకుపచ్చ పిల్లి హల్ చల్... ఫేస్ బుక్ లో ప్రత్యేక పేజీ ఓపెన్!

బల్గేరియా నగరం వర్నాలో ఓ ఆకుపచ్చ పిల్లి హల్ చల్ చేస్తోంది. మేను మొత్తం ఆకుపచ్చ వర్ణంలో ఉన్న ఆ పిల్లి అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ఈ ఆకుపచ్చ పిల్లిపై ఫేస్ బుక్ లో ప్రత్యేకంగా ఓ పేజీ కూడా మొదలైపోయింది. అసలు పిల్లికి ఆకుపచ్చ వర్ణమేంటని కొందరు అనుమానం వ్యక్తం చేస్తుంటే, ఏమో, ఆ రంగులోనూ పిల్లులుండకపోతాయా? అని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు. కొందరు కావాలనే పిల్లికి ఆకుపచ్చ వర్ణం పూసి ఉంటారని అనుమానిస్తున్న నగరవాసులు, ఈ చర్యకు పాల్పడ్డ వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఫేస్ బుక్ పేజీలో కోరుతున్నారు. అయితే రంగు డబ్బాల వద్ద ఆడుకుంటున్న క్రమంలో పిల్లికి ఆకుపచ్చ వర్ణం అంటుకుని ఉంటుందని కొందరు చెబుతుంటే, అలా అయితే శరీరంలో ఏదో ఒక భాగానికి మాత్రమే రంగు అంటుకోవాలని, కాని, దేహం మొత్తం పచ్చ రంగులోకి ఎలా మారుతుందంటూ మరికొందరు వాదిస్తున్నారు. ఏదేమైనా, ఆకుపచ్చ వర్ణంలో కనిపించిన ఈ పిల్లిపై ఒక్క బల్గేరియాలోనే కాక ప్రపంచవ్యాప్తంగా చర్చకు తెరలేసింది.

More Telugu News