ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

తొలితరం అందాలనాయిక 'పుష్పవల్లి'

Thu, Jan 03, 2013
పుష్పవల్లి
పుష్పవల్లి
       తెలుగు తెరపై కాంచనమాల తరువాత ఆ
స్థాయిలో కళ్లతోనే అశేష ప్రేక్షకులను కట్టిపడేసిన కథానాయిక 'పుష్పవల్లి'.
ఉన్నదంతా ఆమె కళ్ల లోనే ఉందనీ, అవి అందంగా ... ఆకర్శణీయంగా ...
రెచ్చగొట్టేలా ఉంటాయని అప్పట్లో అంతా చెప్పుకునేవారు. నిజానికి పుష్పవల్లి
అనేది ఆమె స్క్రీన్ నేమ్ మాత్రమే ... ఆమె అసలు పేరు తాయారమ్మ.
తాడేపల్లిగూడెం సమీపంలోని పెంటపాడు ఆమె స్వగ్రామం. నాటకాలు ... సినిమాలు
అంటే ఇష్టపడే ఆమె, తన 12 వ యేట 'సంపూర్ణరామాయణం'(1936) లో తెర పై
కనిపించింది. ఆ తరువాత క్వాలిటీ పిక్చర్స్  పేరుతో డిస్ట్రిబ్యూట్ చేసే
జి.కె.మంగరాజు ద్వారా ఆమె 'దశావతారములు' చిత్రంలో నటించింది. ఈ సమయంలోనే
ఆయన ఆమె పేరును పుష్పవల్లిగా మార్చాడు.

     ఇక 1938 లో వచ్చిన 'మోహినీ
భస్మాసుర' చిత్రంలో ఆమె మోహినీ పాత్ర ధరించి, అశేష ప్రేక్షకులను తనవైపుకు
తిప్పుకుంది. అందం ... అభినయంతో పాటు ఆట ... పాట తెలిసిన ఆమెను వరుసగా
అవకాశాలు వెదుక్కుంటూ వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆమె 'వరవిక్రయం' ... 'చూడామణి'
... 'తారా శశాంకం' ... 'సత్యభామ' వంటి చిత్రాలతో అంచలంచెలుగా ఎదిగింది.
జెమినీ సంస్థలో 18 సంవత్సరాలు నెల జీతంపై పనిచేస్తూ ఎన్నో సినిమాల్లో
నటించిన పుష్పవల్లి, ఈ సమయంలోనే అక్కడ పనిచేస్తోన్న గణేషన్ ( జెమినీ గణేషన్
) ను పెళ్లి చేసుకుంది. వారి సంతానమే బాబ్జీ - భాను రేఖ. వీరిద్దరిలో
బాబ్జీ కొన్ని సినిమాల్లో బాలనటుడిగా కనిపించగా, భాను రేఖ ... రేఖగా మారి
తిరుగులేని గ్లామర్ తారగా బాలీవుడ్ తెరను ఏలేసింది. 
X

Feedback Form

Your IP address: 54.158.84.38
Movie News (Latest)