ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

విమర్శకులపై రాధ మండిపాటు

Mon, Dec 31, 2012
రాధ
రాధ
       తన కూతురుపై జరుగుతోన్న ప్రచారం
పట్ల నిన్నటి తరం కథానాయిక రాధ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తోంది. నటన
నేర్చుకోవలసిన అవసరం తన కూతురికి లేదంటూ మండిపడుతోంది. విషయమేమిటంటే ...
రాధ
రెండో కూతురు తులసి' కడల్' చిత్రంలో కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమా
షూటింగ్ చివరి దశకి చేరుకుంటోన్న సమయంలో, తులసికి అసలు నటన రావడంలేదనీ ...
ఇక మరో కథానాయికను వెదికే సమయం లేక మణిరత్నం ఆమెతోనే ఆ పాత్రను
చేయిస్తున్నాడంటూ ప్రచారం జరుగుతోంది.
      ఈ నేపథ్యంలో ఈ విషయం పట్ల రాధ
తీవ్రమైన స్థాయిలో స్పందించింది. తాను అగ్రకథానాయికగా వెలుగొందిన
విషయాన్ని రాధ గుర్తు చేస్తూ, తన కూతురు నటన గురించి కొత్తగా తెలుసుకోవలసిన
అవసరం లేదని చెబుతోంది. తులసికి నటనరాదని ప్రచారం చేసే వాళ్లు ఒకసారి
షూటింగ్ జరుగుతోన్న చోటికి వెళ్లి చూడాలని ఆమె అంటోంది. కూతురు కెరియర్
దెబ్బతింటుందని తల్లిగా రాధ ఆవేశపడటంలో అర్ధం ఉన్నా, దర్శకుడిగా మణిరత్నం ఏ
విషయంలోనూ రాజీ పడడని ఒక మాట అంటే సరోపోయేది కదా... అని అంతా
గుసగుసలాడుకుంటున్నారు. 
X

Feedback Form

Your IP address: 54.197.90.95
Movie News (Latest)