ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

మహానటి మనసు బాధపడిన వేళ

Mon, Dec 24, 2012
సావిత్రి
సావిత్రి
      

అన్నపూర్ణ సంస్థ ఏ సినిమా తీసినా అందులో
సావిత్రి ఉండాల్సిందే ... అది అఖండ విజయాన్ని సాధించ వలసిందే ... అని అప్పట్లో
అంతా చెప్పుకునేవారు. సావిత్రికి విజయాలనే కాదు, వీలైనంత క్రేజ్ ను ...
ఇమేజ్ ను తెచ్చి పెట్టడంలో అన్నపూర్ణ చిత్రాలు ప్రధాన పాత్రలు
పోషించాయనడంలో ఎలాంటి సందేహంలేదు. అందువల్ల ఆమె అన్నపూర్ణ సంస్థను ఎంతగానో
అభిమానించడమే కాకుండా, ఎంత బిజీగా వున్నా ఈ బ్యానర్ కి ఆమె తొలి
ప్రాధాన్యతను ఇచ్చేది. అలాంటి సావిత్రిని ఓ వార్త కలవరపెట్టింది ...
కన్నీళ్లు పెట్టించింది.

      ఓసారి అన్నపూర్ణ వారు ఓ సినిమా రూపొందించడానికి
సన్నాహాలు పూర్తి చేశారనీ, ఆ సినిమాలో సావిత్రికి వేషం లేదని తెలిసింది. ఈ
విషయంలో దుక్కిపాటి మధుసూదన రావును అడిగి నిజానిజాలు తెలుసుకోవాలనుకున్న
ఆమె, ఆయన వాహినిలో వున్నారని తెలిసి నేరుగా అక్కడికి వెళ్లింది. స్టూడియోలో
ఎదురైన బి.ఎన్.రెడ్డి ఆమె రాకకు గల కారణం తెలుసుకుని, సెట్లో వున్న
మధుసూదనరావును తన ఆఫీసుకు పిలిపించారు. ఆయన అక్కడికి రాగానే సావిత్రి
ఒక్కసారిగా కన్నీళ్లు పెట్టుకుంది. తాను పారితోషికం పెంచలేదనీ ... డేట్లు
ఖాళీగా లేవని ఎవరితోనూ చెప్పలేదని ... తనకి ఏం తక్కువని చెప్పి ఈ సినిమాలో
తనకి అవకాశం ఇవ్వలేదంటూ ఆయన్ని నిలదీసింది.

      ప్రస్తుతం తాము ఎంచుకున్న కథకి
ఆమె అవసరంలేదనీ ... మరో ఉద్దేశం తమకి లేదని దుక్కిపాటి ఆమెతో అన్నారు. ఈ
విషయం ఇంతగా ఆమెను బాధిస్తుందని అనుకొలేదనీ, మరోసారి ఇలా జరగకుండా
చూసుకుంటానని ఆయన నచ్చజెప్పారు. దాంతో కన్నీళ్ల పర్యంతమౌతూనే సావిత్రి
అక్కడి నుంచి వెళ్ళిపోయిందట.
X

Feedback Form

Your IP address: 54.147.212.136
Movie News (Latest)