ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

సావిత్రి ఇంట అమ్మవారు!

Fri, Dec 14, 2012
సావిత్రి
సావిత్రి
       తెలుగు తెరపై చిన్న చిన్న వేషాలతో కెరీర్ ప్రారంభించి... కాలక్రమంలో కథానాయికగా  ... మహానటిగా
వెలుగొందిన నటి సావిత్రి. చిన్నప్పటి నుంచి కూడా ఆమెకు దైవ భక్తి
ఎక్కువగా వుండేది. ఊహ తెలిసిన నాటి నుంచి ఆమె ఎక్కువగా దుర్గాదేవిని
ఆరాధించేది. షూటింగ్ నిమిత్తం ఏ వూరు వెళ్లినా అక్కడికి దగ్గరలో అమ్మవారి
గుడి వుందని తెలిస్తే చాలు, షూటింగ్ పూర్తి కాగానే అక్కడికి వెళ్లి
దర్శనం చేసుకుని వచ్చేది. అలాంటి సావిత్రికి ఓసారి, ఓ సినిమా షూటింగ్ కోసం
తెచ్చిన అమ్మవారి విగ్రహం ఎంతగానో నచ్చేసింది. అయితే ఆ సినిమా వాళ్ళు అది
తనకి ఇవ్వడానికి ఒప్పుకుంటారో, లేదోనని ఆమె చాలా టెన్షన్ పడిపోయిందట.

     ఈ
సంఘటన 'నర్తనశాల' (1963) చిత్ర నిర్మాణ సమయంలో జరిగింది. రాజ్యం పిక్చర్స్
వారు కమలాకర కామేశ్వరరావు దర్శకుడిగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ
సినిమాలో సావిత్రి అమ్మవారిని స్తుతిస్తూ ఓ పాటలో నటించాలి. ''జనని
శివకామిని జయశుభ కారిణి విజయ రూపిణి'' అనే పాట విన్న సావిత్రి పరవశించి
పోయింది. ఈ పాటకు అవసరమైన అమ్మవారి ప్రతిమను తయారు చేయించి తెచ్చారు. ఆ
విగ్రహాన్ని చూసిన సావిత్రి తన్మయత్వంతో తరించిపోయింది.

     తననీ ... తన
పాత్రని సైతం మరిచిపోయి అమ్మవారి భక్తురాలిగానే ఆ పాటలో మమేకమై ఆమె
కనిపించింది. అందుకే ఇప్పటికీ ఆ పాట  ... ఆ దృశ్యం ప్రేక్షకుల హృదయాల్లో
అలా నిలిచిపోయాయి. ఇక అమ్మవారి విగ్రహానికి సంబంధించిన షూటింగ్ పూర్తి
కాగానే, అది తనకి కావాలని చిన్న పిల్లలా నిర్మాత లక్ష్మీ రాజ్యాన్ని
అడిగింది సావిత్రి. అమ్మవారంటే ఆమెకి ఎంత ఇష్టమో తెలిసిన లక్ష్మీ రాజ్యం, ఏ
మాత్రం ఆలోచించకుండా ఆ ప్రతిమను సావిత్రి ఇంటికి పంపించింది. ఆ రోజు నుంచి
చివరి వరకూ సావిత్రి ఆ ప్రతిమను పూజిస్తూ వచ్చింది. 
X

Feedback Form

Your IP address: 54.204.198.71
Movie News (Latest)