ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

సుదీప్ హీరోగా 'చంద్రముఖి' సీక్వెల్

Thu, Dec 06, 2012
సుదీప్
సుదీప్
       అవును ... 'చంద్రముఖి' సీక్వెల్లో కథానాయకుడిగా సుదీప్ దర్శనమివ్వబోతున్నాడు. 'చంద్రముఖి' లో రజనీకాంత్ ...
'నాగవల్లి' లో వెంకటేష్ కనిపించిన పాత్రలో ఇప్పుడు సుదీప్ కనిపించనున్నాడు.
ఇక తెలుగు తెరపై 'చంద్రముఖి' సినిమా సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు.
రజనీకాంత్ ... ప్రభు ... నయనతార ... జ్యోతిక ప్రధాన పాత్రలను పోషించిన ఈ
సినిమా, అటు తమిళంలోనూ ... ఇటు తెలుగులోనూ అనూహ్యమైన రీతోలో ప్రేక్షకులను
ఆకట్టుకుంది. అయితే ఈ సినిమాకు అసలు మూలం మలయాళ చిత్రం 'మణిచిత్ర తాళు'. ఈ
సినిమాను కన్నడలో విష్ణువర్ధన్ హీరోగా 'ఆప్తమిత్ర' పేరుతో రీమేక్ చేయడం
జరిగింది.

     తర్వాత దర్శకుడు పి.వాసు ఈ సినిమా మాతృకను చాలా వరకూ మార్చేసి,
'చంద్రముఖి' పేరుతో తెలుగు ... తమిళ భాషల్లో విజయాన్ని అందుకున్నారు. ఆ
తరువాత ఈ సినిమా రెండో భాగంగా 'కన్నడలో 'ఆప్త రక్షక' రూపొందగా, దాని తెలుగు
రీమేక్ 'నాగవల్లి' పేరుతో ప్రేక్షకుల ముందుకి వచ్చింది.  అయితే ఈ సినిమా
ప్రేక్షకులను అలరించలేకపోయింది. ఈ నేపథ్యంలో 'ఆప్త రక్షక'
సినిమాకి కొనసాగింపును రూపొందించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇందులో
కథానాయకుడిగా సుదీప్ కనిపించనున్నాడు. తెలుగు ... తమిళ ... కన్నడ
భాషల్లో సుదీప్ కి మంచి క్రేజ్ వుంది. ఈ కారణంగా ఈ  సినిమాను కన్నడతో పాటు
తెలుగులో కూడా విడుదల చేసేందుకు నిర్మాత ద్వారకేష్ ప్రయత్నిస్తున్నారు. 
X

Feedback Form

Your IP address: 54.205.150.215
Movie News (Latest)