ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

మణిరత్నం చలవే అంటోన్న అభిషేక్!

Sat, Dec 01, 2012
అభిషేక్
అభిషేక్
      బాలీవుడ్ తెరపై తాను కథానాయకుడిగా
నిలదొక్కుకోవడానికి కారణం మణిరత్నమంటూ ఆయనకి కృతజ్ఞతలు
తెలియజేస్తున్నాడు అభిషేక్ బచ్చన్. 'కన్వర్వేజేషన్ విత్ మణిరత్నం' పేరుతో
భరద్వాజ్ రంగన్ రాసిన పుస్తకం చదివిన అభిషేక్, అందులోని విషయాలను గురించి
ప్రస్తావిస్తూ, ఇలా సోషల్ నెట్ వర్కింగ్ సైట్ ట్విట్టర్ లో పోస్ట్
చేశారు.
    తాను వరుసగా 17 ఫ్లాపులను చవిచూశాననీ, కెరియర్ విషయంలో సందిగ్ధంలో
పడినప్పుడు తనతో మణిరత్నం 'యువ' సినిమా చేశారని చెప్పారు. ఆ సినిమాతో తాను
హీరోగా నిలదొక్కుకున్నాననీ, ఆ తరువాత 'గురు' చిత్రంలో కూడా ఆయన తన పాత్రను
అద్భుతంగా తీర్చిదిద్దారని అన్నారు. ఈ సినిమా నటుడిగా తనలోని పరిణతిని
ఆవిష్కరించిందని అన్నారు.
      సినిమాను ఇష్టపడే ప్రతి ఒక్కరూ ఆయనపై వచ్చిన ఈ
పుస్తకాన్ని చదవాల్సిందేనని చెప్పారు. భారతీయ సినిమా పరిశ్రమలో మణిరత్నం ఓ
'సినిమాటిక్ జీనియస్' అని ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
X

Feedback Form

Your IP address: 54.147.196.37
Movie News (Latest)