ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

'బంగారం'లాంటి కథానాయిక సావిత్రి

Fri, Nov 23, 2012
సావిత్రి
సావిత్రి
         తెలుగు తెరను ఏలిన కథానాయికలలో సావిత్రి
స్థానం ప్రత్యేకమని చెప్పక తప్పదు. అప్పట్లో సావిత్రి అభినయం గురించే కాదు
... ఆమె సిరి సంపదల గురించి కూడా అంతా ఆశ్చర్యంగా చెప్పుకునేవారు. ఆయుర్వేద
వైద్యులు ఎప్పుడూ ఇంట్లో కూర్చుని మందులు నూరుతున్నట్టు, సావిత్రి ఇంట్లో
బంగారు నగలు తయారు చేయించే పనులు కూడా అదే తరహాలో ప్రతి రోజు జరుగుతూ
ఉండేవి. ఇక పెళ్లికి వెళితే వాళ్లతో తనకి వున్న అనుబంధాన్ని బట్టి బంగారు
మంగళ సూత్రాలు ... వెండి బిందెలు ... బంగారు నెక్లెస్ లు కానుకలుగా
ఇచ్చేది. ఆమెను చూసిన వాళ్లంతా బంగారంతో ఇన్నిరకాల ఆభరణాలు చేయించుకోవచ్చా?
అని ఆశ్చర్యపోయేవారు.

        అలాంటి సావిత్రి ఒకసారి నటి పద్మిని పెళ్లి
రిసెప్షన్ కి వెళితే, అక్కడున్న వాళ్లంతా ఆమెను గురించి గుసగుసలాడు కోవడం
మొదలుపెట్టారు. తాను కాళ్లకు బంగారు పట్టీలు ... బంగారు మెట్టెలు
పెట్టుకోవడం గురించే వాళ్లంతా మాట్లాడుకుంటున్నారని గ్రహించిన సావిత్రి,
నిజంగానే తాను తప్పుచేశానేమోనని అనుకుంటూ, ఇంటికి తిరిగి వచ్చింది. కాళ్లకి
బంగారు వస్తువులు ధరించడమంటే లక్ష్మీదేవిని అవమాన పరచడమేననే మాటలు గుర్తుకు
రావడంతో, వాటిని మార్చుకోవాలనే నిర్ణయానికి వచ్చింది. అయితే సావిత్రితో
చనువుగా ఉండే కథానాయికలంతా ఆ మరుసటి రోజే ఆమెకి ఫోన్ చేసి, అచ్చు అలాంటి
పట్టీలు ... మెట్టెలు చేయించుకుంటున్నట్టు చెప్పారు. దాంతో సావిత్రికి మనసు
కుదుటపడి తన ఆలోచనను విరమించుకుంది. ఇలా కాళ్ళకి బంగారు ఆభరణాలు
ధరించడమనేది సావిత్రితోనే మొదలైందని ఇప్పటికీ చెప్పుకుంటారు. 
X

Feedback Form

Your IP address: 54.163.129.96
Movie News (Latest)