ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

అగ్ర కథానాయకుడి చూపు ... ఆ వైపు!

Thu, Nov 15, 2012
జగపతి బాబు
జగపతి బాబు
     తెలుగులో అగ్ర కథానాయకుడిగా ఓ వెలుగు వెలిగిన జగపతి బాబు, తన దృష్టిని
కోలీవుడ్ పై పెట్టినట్టుగా తెలుస్తోంది. ఆయన మాటలు విన్న ఎవరికైనా ఈ విషయం
స్పష్టంగా అర్ధమౌతుంది. కథానాయకుడిగా అవకాశాలు తగ్గడంతో, మల్టీ స్టారర్
చిత్రాల వైపు ఆయన మొగ్గుచూపారు. ప్రాధాన్యతగల పాత్రలను చేయడానికి సైతం ఆయన
సిద్ధపడ్డారు. అయినా పరిస్థితులు ఆశాజనకంగా లేకపోవడంతో, ఆయన తన దృష్టిని
తమిళ చిత్రాలపై పెట్టారు. తనని ఆదరిస్తే అక్కడే స్థిరపడిపోతానని కూడా ఆయన
అన్నారు.

     'శివతాండవం' చిత్రంలో జగపతి బాబు పోషించిన పాత్రకు అక్కడి
ప్రేక్షకులు మంచి మార్కులు వేశారు. ఆ సినిమా తరువాత ఆయన నటించిన 'పుత్తగం'
చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆర్య తమ్ముడు సత్య హీరోగా విజయ్
ఆదిరాజ్ తెర క్కించిన ఈ సినిమాలో జగపతి బాబు ఓ కీలకమైన పాత్రను పోషించాడు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తమిళ
ప్రేక్షకులు ఆదరిస్తే తాను అక్కడే స్థిరపడిపోతానని చెప్పారు. ఈ సందర్భంగా
జగపతి బాబు నటనను ... వయసు పెరుగుతున్నా తగ్గని ఆయన గ్లామర్ ను ప్రశంసిస్తూ
రాధిక - సుహాసిని మాట్లాడారు.
X

Feedback Form

Your IP address: 54.147.212.136
Movie News (Latest)