Warning: getimagesize(backimages/cinemaphotos/thumbnail/_8675): failed to open stream: No such file or directory in /home/srirama/public_html/ap7am-movie-news-display.php on line 60
ఇది ఎవరు తేల్చిన 'బ్రాహ్మణిజం'?..
ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

ఇది ఎవరు తేల్చిన 'బ్రాహ్మణిజం'?

Wed, Oct 17, 2012
        'ఏ ఉమెన్ ఇన్ బ్రాహ్మణిజం' పేరుతో
త్వరలో ఓ సినిమా ప్రేక్షకుల ముందుకి రానుంది. ఈ సందర్భంగా విడుదల చేసిన ఈ
సినిమా ట్రైలర్స్ చూసి అంతా ఆశ్చర్యపోయారు. బ్రాహ్మణులు తలదించుకునేలా
...  ఆ కులస్త్రీలను కించపరిచేలా ఈ సినిమాలో కామకేళి దృశ్యాలు వున్నాయంటూ
విమర్శలు వచ్చాయి. అసలు ఈ దర్శక నిర్మాతలు తీసుకున్నా కథా వస్తువే
బ్రాహ్మణులకు తలవంపులు
తెచ్చేదిగా ఉందనీ, ఈ నేపథ్యంలో ఇది ఎవరు తేల్చిన 'బ్రాహ్మణిజం' అంటూ
బ్రాహ్మణ సంఘాలు రంగంలోకి దిగాయి. ఈ సినిమాను నిషేధించాలంటూ రాష్ట్ర
వ్యాప్తంగా బ్రాహ్మణ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. చలం రాసిన 'బ్రాహ్మణీకం'
నవల ఆధారంగా ఈ సినిమా రూపొందించినట్టు దర్శక నిర్మాతలు సమర్ధించుకుంటూ
ఉండటం పట్ల వాళ్లు  తీవ్రమైన అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు.

       చలం వంటి
గొప్ప వ్యక్తి రాసిన పుస్తకం పేరును అడ్డుపెట్టుకుని, బ్రాహ్మణ స్త్రీలను
కించపరిచేలా సినిమాలు తీయడం పట్ల బ్రాహ్మణ సంఘాలు మండిపడుతున్నాయి. ఇలా
కులాలను ... మతాలను కించపరిచేలా సినిమాలు తీయడం శోచనీయమనీ, తక్షణమే ఈ
సినిమా విడుదలను నిలిపివేయాలని ఏపీ బ్రాహ్మణ సేవా సమాఖ్య డిమాండ్ చేసింది.
ఇక  ప్రముఖ కూచిపూడి నృత్య కళాకారిణి స్వాతి సోమనాథ్ కూడా ఈ సినిమా దర్శక
నిర్మాతలపై తీవ్రమైన స్థాయిలో ద్వజమెత్తారు. చలం పుస్తకం పేరును సాకుగా
చూపించి ఈ సినిమాను రూపొందించిన దర్శక నిర్మాతలను ... ఇలాంటి బూతు సినిమాకి
సర్టిఫికేట్ ఇచ్చిన సెన్సార్ బోర్డు వాళ్లను ఉరి తీయాలని అన్నారు.  
X

Feedback Form

Your IP address: 54.161.128.52
Movie News (Latest)